కలెక్టరేట్‌లో సత్యసాయి శత జయంతి వేడుకలు
జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు చింతల జీవన్, చింతల రాజు, ఉప్పులూరి రామ్మోహన్, అవినాష్, పరమేష్, సంతోష్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. భజన, సంకీర్తన కార్యక్రమాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు.