గేటు కారేపల్లి ఆలయ మార్గానికి రూ.2 లక్షల వితరణ
KMM: గేటు కారేపల్లిలోని ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి దాత మంద అప్పారావు రూ.2 లక్షల విలువైన విద్యుత్ సామగ్రిని వితరణ చేశారు. ఆలయం గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉండటంతో రాత్రివేళ భక్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, ఆయన విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లను సమకూర్చారు.