నీటి గుంటలో వ్యక్తి మృతదేహం

నీటి గుంటలో వ్యక్తి మృతదేహం

SRD: ఇసుక నీటి గుంటలో వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన కంది మండలం ఆరుట్ల శివారులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామచందర్ (36) మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 12 నుంచి కనిపించకపోవడంతో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రామచందర్ శవం నీటి గుంటలో కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.