తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు
KNR: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. గంగాధరలో అత్యధికంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. చొప్పదండిలో 15, కొత్తపల్లిలో 12, కరీంనగర్ రూరల్లో 10, రామడుగులో 27 నామినేషన్లు నమోదయ్యాయి. 866 వార్డులకు గాను, తొలి రోజు 86 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు.