బయోగ్యాస్ ప్లాంట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం దివాకరపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ పనులను ఆదివారం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ.. బయోగ్యాస్ ప్లాంట్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే మండల రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.