నారాయణవనంలో ఘనంగా ఊయల సేవ

నారాయణవనంలో ఘనంగా ఊయల సేవ

TPT: నారాయణవనంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఊయల సేవ శనివారం ఘనంగా నిర్వహించారు. పంచతీర్థాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. కర్పూర హారతులు అందించారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్ల ఊయల సేవ రమణీయంగా జరిగింది.