కాగజ్ నగర్ ఏరియా ఆసుపత్రిలో ICU ప్రారంభించిన MLA
ASF: కాగజ్ నగర్ ఏరియా ఆసుపత్రిలో 15 పడకల ICUని MLA హరీశ్ బాబు మంగళవారం ప్రారంభించారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 10 స్ట్రెచర్ బెడ్లను అందజేశారు. కొత్త భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే రోగులకు పూర్తిస్థాయిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.