అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు

AKP: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ డాక్టర్ డీడీ నాయుడు తెలిపారు. కిడ్నీ ఫెయిల్ అయిన రోగులు ఇక్కడకు ఎక్కువగా వస్తున్నారని అన్నారు. వారు కేజీహెచ్‌కు వెళ్లనవసరం లేకుండా ఇక్కడే ఆ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ ఫెయిల్ అయిన రోగులు ముందుగా వైద్యులను సంప్రదించాలని సూచించారు.