నెల్లూరులో పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం

NLR: జిల్లాలో TDP పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. పార్టీ కోసం క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి అధినేత CBN పెద్దపీట వేస్తారన్నారు. పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు.