భారీ వరద ముప్పు.. ఆందోళనలో ప్రజలు

భారీ వరద ముప్పు.. ఆందోళనలో ప్రజలు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముస్సోరిలో కుండపోత వర్షాల కారణంగా కెంప్టీ జలపాతం ఉగ్రరూపం దాల్చింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.