చెరువును తలపిస్తున్న మధిర ఎంప్లాయిస్ కాలనీ

KMM: మధిర ఎంప్లాయిస్ కాలనీ చెరువును తలపిస్తుందని స్థానికులు తెలిపారు. వర్షం పడ్డ ప్రతిసారి వరద నీరు ఇళ్ల మధ్య భారీగా నిల్వ ఉంటుందని చెప్పారు. దీని కారణంగా ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఉందని అన్నారు. అటు రోడ్డుపై కూడా వరద నీరు నిల్వ ఉంటుందన్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి వరద నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.