VIDEO: పట్టుబడిన బియ్యం రైస్ మిల్లులో నిలువ
MDK: తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో భారీగా పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యాన్ని రామాయంపేట మండలం డి.ధర్మారంలోని వెంకటేశ్వర రైస్ మిల్లుకు తరలించారు. ఈ మేరకు మంగళవారం పౌరసరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్ తాటి నర్సింలు వివరాలు వెల్లడించారు. సుమారు రూ.16 లక్షల విలువైన 294.50 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.