కోలాటం ఆడిన ఎంపీ డీకే అరుణ

కోలాటం ఆడిన ఎంపీ డీకే అరుణ

MBNR: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం తన పార్లమెంటు నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం, ఆమె అక్కడున్న మహిళలతో కలిసి ఉత్సాహంగా కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.