VIDEO: జయితి ఆల్తి పేరంటాల గుడికి పోటెత్తిన భక్తులు
VZM: మెంటాడ మండలం జయితి గ్రామంలో వెలసిన ఆల్తి పేరంటాలమ్మ గ్రామదేవత పండగ సందర్భంగా ఇవాళ అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మండలంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.