జల జీవన్ మిషన్ పథకానికి స్థల పరిశీలన
SKLM: ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ చిన్నరావుపల్లి గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి కొళాయిలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు, విజయనగరం పార్లమెంటరీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ గాలి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయన వెంట సర్వేయర్ లోకేష్, కూటమి నాయకులు పప్పాల సూర్యనారాయణ ఉన్నారు.