ఈ నెల 19, 20న ఇసుక రవాణా బంద్
JBL: జిల్లాలో ఈ నెల 19, 20 తేదీల్లో క్వారీల నుంచి లారీల ద్వారా ఇసుక రవాణాను నిలిపివేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గురువారం ఆదేశించారు. 20న సీఎం రేవంత్ రెడ్డి కాటారం మండలంలోని నస్తురుపల్లిలో బహిరంగ సభ, మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాంతాల్లో పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.