వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అలాగే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.