'గంగాభవాని ఆలయంలో లక్ష కుంకుమార్చన'

'గంగాభవాని ఆలయంలో లక్ష కుంకుమార్చన'

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ బంగారుపేటలో వెలసిన శ్రీశ్రీశ్రీ గంగాభవాని అమ్మవారి 33 వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా.అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన లక్ష కుంకుమార్చన' (పుణ్యస్త్రీ వ్రతం) కార్యక్రమం వైభవంగా జరిగింది. పూజలో పాల్గొన్న స్త్రీలకు అమ్మవారి ప్రసాదంగా మంగళప్రదమైన గాజులు, పసుపు కుంకుమలు అందజేశారు.