సాకి చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ

SRD: పటాన్ చెరు డివిజన్ పరిధిలో సద్దుల బతుకమ్మ పండుగను సెప్టెంబర్ 29 సోమవారం రోజున, దసరా పండుగను అక్టోబర్ 2, నిర్వహించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. శనివారం పటాన్ చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో పండుగ తేదీలపై స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.