వేసవి శిబిరాన్ని సందర్శించిన అధికారులు
MBNR: పాలమూరు యూనివర్సిటీ వేసవి శిబిరాన్ని అకాడమిక్ సెల్ డైరెక్టర్ డా. ఎన్. చంద్రకిరణ్ బృందం గురువారం సందర్శించింది. వాలంటీర్ల పనితీరును పరిశీలించారు. గ్రామ సమస్యలను గుర్తించి ప్రాధాన్యతను బట్టి పరిష్కార మార్గాలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. కె. ప్రవీణ, ప్రిన్సిపాల్ డా. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.