'జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి'
SKLM: జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్దానం ప్రాంతంనకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గూర్చి సంబంధిత డిఈ కలెక్టర్‌కు వివరించారు.