నూతన మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
KMM: మధిర తహశీల్దార్ కార్యాలయంలో శనివారం కొత్త మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. షేక్ బాజీ సైదు అధ్యక్షుడిగా, కె.ప్రభాకర్‌రావు ఉపాధ్యక్షుడిగా, బి.శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా, వెంకట్రావమ్మ కోశాధికారిగా, వై. రంజిత మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. పదవులు చేపట్టిన వారిని తహశీల్దార్ రాంబాబు అభినందించారు.