గర్భిణీకి రక్తదానం చేసిన కానిస్టేబుల్

NGKL: తాడూరు మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గర్భిణీ యాదమ్మ ప్రసవ నిమిత్తం గురువారం జిల్లాలోని జనరల్ ఆసుపత్రికి వచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు శాస్త్ర చికిత్స చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. కాన్పు చేయాలంటే తక్షణమే రక్తం ఎక్కించాలని యాదమ్మ భర్త విష్ణుకు చెప్పారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న కానిస్టేబుల్ జితేందర్ వెంటనే స్పందించి రక్త దానం చేశారు.