ఓం బిర్లాకు మోదీ బర్త్ డే విషెస్
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. స్పీకర్ బిర్లా శాంత స్వభావం, ఏకతా దృష్టి, పార్లమెంట్ నిర్వహణలో చూపుతున్న నాయకత్వాన్ని ప్రశంసించారు. చట్ట సభ ప్రక్రియలను బలోపేతం చేయడం, పార్లమెంట్ గౌరవాన్ని నిలబెట్టడంలో ఓం బిర్లా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.