"అరైవ్ అలైవ్” కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌లు
హనుమకొండ కలెక్టరేట్‌లో "అరైవ్ అలైవ్” కార్యక్రమంపై శుక్రవారం పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, ఏసీపీలు, ఆర్&బీ, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను విజయవంతం చేయాలని వారు కోరారు.