కనిగిరి రానున్న గీతామాధురి

కనిగిరి రానున్న గీతామాధురి

ప్రకాశం: ప్రముఖ సినీ నేపథ్య గాయని గీతా మాధురి నేడు కనిగిరి పట్టణానికి రానున్నారు. పామూరు రోడ్డులో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఆహ్వానం మేరకు ఆమె వస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో గీత మాధురి పాల్గొని, సినీ గీతాలను ఆలపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కూడా పాల్గొననున్నారు.