VIDEO: 'అక్రమ ఆక్వా చెరువులపై చర్యలు తీసుకోవాలి'
కోనసీమ: జిల్లాలో డ్రైనేజీలు వ్యవస్థ అద్వానంగా ఉందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన దిశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో అక్రమ ఆక్వా చెరువులు ఎక్కువగా ఉన్నాయని, ఆపరేషన్ కొల్లేరు మాదిరిగా ఆక్వా అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు.