ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సాధించాలి: కలెక్టర్

NLG: ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి సందర్భంగా గత రెండు వారాలుగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈరోజు ప్రారంభం కాగా 25 మంది వినతులు సమర్పించారు.