VIDEO: జమ్మల మడకలో విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు

VIDEO: జమ్మల మడకలో విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు

ప్రకాశం: కనిగిరి మండలం జమ్మలమడక గ్రామంలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ కిందపడిపోయి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయినట్లు గ్రామ సర్పంచ్ పాశం కొండయ్య తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.