స్పాట్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానం

సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ వీర ప్రభాకర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేటలో ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15, 16 తేదీలలో విద్యార్థులు ధృవపత్రాలతో కాలేజీలో హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం 7569860140, 7306379960 ఫోన్ చేయాలన్నారు.