బాలిక హత్య ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే

MDCL: కూకట్ పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని MLA మాధవరం కృష్ణారావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారిని హత్య చేయడం దారుణమని, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. నగరంలో హత్యలు పెరిగిపోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హత్యలు ఎన్ని జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత పదేళ్లలో ఒక్క ఘటన కూడా జరగలేదన్నారు.