ఈనెల 22న ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఈనెల 22న ( శనివారం) ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు చెంగారెడ్డి తెలిపారు. కంటిలో పొరా, దూరపు చూపు, మెల్లకన్ను, కంటి చూపు తగ్గిన ఇలా కంటి సమస్యలు ఉన్నవారు, వయసుతో నిమిత్తం లేకుండా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.