కొండాపూర్‌లో ఫార్మేషన్ రోడ్డు పనులు ప్రారంభం..!

కొండాపూర్‌లో ఫార్మేషన్ రోడ్డు పనులు ప్రారంభం..!

MDK: రేగోడ్ మండలం కొండాపూర్‌లో ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం పంచాయతీ సెక్రటరీ అశోక్‌తో కలిసి సర్పంచ్ పండరి ప్రారంభించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఈ పనులు చేపట్టామని వారు తెలిపారు. ఈ రోడ్డు వల్ల ప్రజలకు రాకపోకలు మరింత సులభం కానున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ నాణ్యమైన పనులు చేస్తామని హామీ ఇచ్చారు.