రేపు కళ్యాణదుర్గంలో వాహనాల వేలం

ATP: అక్రమ మద్యం, సరఫరా కేసుల్లో పట్టుబడిన ద్విచక్రవాహనాలను కళ్యాణ దుర్గం సెబ్ స్టేషన్ ఆవరణలో బుధవారం వేలం వేస్తున్నట్లు సెబ్ సీఐ వెంకట్ సోమవారం తెలిపారు. వేలంలో పాల్గొననున్నవారు ఆధార్ కార్డుతోపాటు రూ.1000 డిపాజిట్ చేయాలన్నారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనాలని కోరారు.