VIDEO: రాజంపేటలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
అన్నమయ్య: రాజంపేట కొత్త బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కనపర్తి కీర్తి అనే విద్యార్థిని శనివారం ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిట్వేలి మండలానికి చెందిన కీర్తి, తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.