శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం

NDL: శ్రీశైలం జలాశయానికి శుక్రవారం సాయంత్రం భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుంచి 73, 303 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 2,248 క్యూసెక్కుల చొప్పున మొత్తం 75, 551 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా ఉంది. దీంతో ప్రాజెక్టులో 215.8070 టీఎంసీల నీటి నిల్వతోపాటు 848.30 అడుగుల నీటిమట్టం నమోదైంది.