భోగి వేడుకల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
RR: ఎల్బీనగర్‌లో భోగి పండుగ సందర్భంగా గడ్డి అన్నారంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వివేకానంద బస్ స్టాప్ వద్ద భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై, భోగి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు భోగి పండ్లు పోశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.