జనసేనలో చేరిన వైసీపీ శ్రేణులు

AKP: అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట, రాజన్నపాలెం, ఉద్దపాలెం, తాళ్లదిబ్బకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కండువాలు వేసి సాగరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో మాజీ సర్పంచ్ జగ్గారావు, నాయకులు పైడికొండ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.