ఘనంగా ఎల్లమ్మతల్లి తొలేళ్ళు ఉత్సవం

ఘనంగా ఎల్లమ్మతల్లి తొలేళ్ళు ఉత్సవం

విజయనగరం సంగీత కళాశాల సమీపంలో ఉన్న ఎల్లమ్మతల్లి తొలేళ్ళు ఉత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ అర్చకులు సన్యాసిరావు వేకువజాము నుండి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు, కుంకుమలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం సిరిమాను ఉత్సవం జరగనుందని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.