రూ.17 లక్షల విలువైన గ్యాస్ సిలిండర్ల చోరీ!
యూపీలో భారీ దోపిడి జరిగింది. ఝన్సీ గ్వాలియర్ రోడ్డులోని BPCL ప్లాంట్ నుంచి కాన్పూర్‌కు 524 గ్యాస్ సిలిండర్లతో లారీ బయలుదేరాల్సి ఉంది. అయితే హోలీ సందర్భంగా లారీని డ్రైవర్ ప్లాంట్ బయట పార్క్ చేసి ఇంటికి వెళ్లగా.. కొంతమంది దుండగులు ఆ వాహనాన్ని అపహరించుకునిపోయారు. లారీలోని సిలిండర్లను దొంగిలించి ఖాళీ వాహనాన్ని కాన్పూర్ రోడ్డులో విడిచిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.