మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

ASR: డుంబ్రిగుడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎస్సై పాపినాయుడు ఆధ్వర్యంలో మంగళవారం మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులకు దూర ప్రయాణాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలో వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.