'శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు'

'శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు'

KMM: రోడ్లపై ఘర్షణలు పడుతూ, పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలిపెట్టేదిలేదన్నారు. అదేవిధంగా రోడ్లపై పెద్దసౌండ్లతో సౌండ్ పొల్యూషన్‌కు కారణమయ్యే డీజేలను సీజ్ చేయటంతోపాటు వాటి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు.