'చంద్రబాబు కూల్చిన ఆలయాలను జగన్ కట్టించారు'
AP: CM చంద్రబాబు చెప్పిందే DY CM పవన్ మాట్లాడుతున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇరు నేతలు దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ CM జగన్ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేదన్నారు. గతంలో చంద్రబాబు కూల్చిన ఆలయాలను జగన్ కట్టించారని.. అర్చకులకు మేలు చేశారని చెప్పారు. ధర్మాన్ని కాపాడిన వ్యక్తి జగన్ అని తెలిపారు.