మత్తు పదార్థాల అనర్థాలపై గోడపత్రిక ఆవిష్కరణ

వనపర్తి: యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల బారిన పడకుండా పోలీసు, విద్యా, పంచాయతీ శాఖల సమన్వయంతో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రూపొందించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.