వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉంది

వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉంది

PPM: జియ్యమ్మవలస మండలం గడసింగుపురం గ్రామంలో కిడ్నీ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డీఎంహెచ్ఓ డా. భాస్కరరావు మంగళవారం తెలిపారు. ఈనెల18, ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన పై విధంగా స్పందించారు. గత కొన్నేళ్లుగా గ్రామంలో ఆరుగురు మరణించగా, వారు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు.