తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్‌ఎస్ ఆకస్మిక తనిఖీలు

తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్‌ఎస్ ఆకస్మిక తనిఖీలు

GNTR: తెనాలిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని గుంటూరు డీసీహెచ్‌ఎస్ రంగారావు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలడం వల్ల ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.