ఈ పోటీలు రాష్ట్రానికి గర్వకారణం: మంత్రి

TG: రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. ఈ పోటీల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని పంచేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మిస్ వరల్డ్ గ్లోబల్ యూనిట్‌కి వేదిక అని ఆయన తెలిపారు. మన రాష్ట్ర సంప్రదాయం, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేందుకు ఇదో మంచి అవకాశమని పేర్కొన్నారు.