స్కూల్ బస్సులను తనిఖీ చేసిన పోలీసులు
MHBD: గార్ల, బయ్యారం మండలాల పరిధిలో సీఐ రవీందర్ స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా డ్రైవర్‌లు మద్యం తాగి, అతివేగంతో వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. వాహనాలకు సరైన ధ్రువపత్రాలు ఉండాలని, డ్రైవర్‌లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.