సురవరం మృతిపట్ల సంతాపం ప్రకటించిన కోమటిరెడ్డి బ్రదర్స్

NLG: CPI అగ్ర నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతిపట్ల కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి NLG పార్లమెంటు సభ్యులుగా రెండు పర్యాయాలు ఎంపికై జిల్లా ప్రజల్లో చెరగని ముద్ర వేశారని వారు అన్నారు. గొప్ప నాయకుడిని కోల్పోయామని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.