'వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు'
BPT: వృత్తి విద్య కోర్సులతో ఉఫాది అవకాశాలు పొందవచ్చని డీఈవో శ్రీనివాస సింగ్ తెలిపారు. వలపర్ల గ్రామంలో గతేడాది దసరా సెలవుల్లో వృత్తి విద్య కోర్సు పూర్తి చేసిన వారికి దృవ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృత్తి విద్య పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వృత్తి విద్యలో నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు.